ICC Champions Trophy | అర్థ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడుగా జట్టు స్కోర్ పెంచేందుకు ప్రయత్నిస్తున్న డెరిల్ మిచెల్.. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఔట్ అయి పెవిలియన్ దారి పట్టాడు. ఆరు వికెట్లు కోల్పోయిన కివిస్ స్కోర్ 211 పరుగులు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన మిచెల్ కవర్ మీదుగా బౌండరీ దాటించాలని ప్రయత్నించాడు. కానీ కవర్లో ఉన్న రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో డెరిల్ మిచెల్ ఇన్నింగ్స్‌కు తెర పడింది. అప్పటి వరకూ మిచెల్ బ్రేస్‌వెల్‌తో కలిసి ఆరో వికెట్ భాగస్వామ్యానికి 46 పరుగులు జత చేశారు.