హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆయన హయాంలో హెచ్‌సీఏలో జరిగిన రూ. 20 కోట్ల అక్రమాలపై విచారణకు హాజరుకావాలని ఈడీ అజారుద్దీన్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. అజారుద్దీన్ గురువారమే విచారణకు హాజరుకావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను అందుబాటులో ఉండటం లేదని, వారం రోజులు గడువు కావాలని కోరుతూ ఆయన ఈడీ అధికారులకు లేఖ రాశారు. లేఖను పరిగణనలోకి తీసుకున్న ఈడీ.. మరో నోటీసు జారీ చేస్తూ ఈనెల 8న విచారణకు హాజరుకావాలని ఆయనకు సూచించింది.