కంఠేశ్వర్, జూన్ 27: భువనేశ్వర్ వేదికగా జరిగిన 78వ జాతీయ సీనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ స్విమ్మర్ మిట్లపల్లి రిత్విక పసిడి పతకంతో మెరిసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన రిత్విక టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. శుక్రవారం జరిగిన మహిళల 50మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ రేసును రిత్విక 33.98సెకన్లలో ముగించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
ఇదే విభాగంలో పోటీపడ్డ హర్షిత జయరామ్(ఆర్ఎస్పీబీ, 34.21సె), అవ్ని చంబ్రా(పంజాబ్, 34.51సె)వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. జాతీయ టోర్నీలో అదరగొట్టిన నిజామాబాద్ స్విమ్మర్ రిత్వికను పలువురు అభినందించారు. జూలై 14 నుంచి జర్మనీలో జరిగే ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ రిత్విక సత్తాచాటాలని రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి ఉమేశ్ ఆకాంక్షించారు.