ఢిల్లీ : ఐపీఎల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్నదానిపై అనిశ్చితి కొనసాగుతున్నది. లీగ్లో తమ తొలి మ్యాచ్ (ఏప్రిల్ 1) కంటే ముందే అతడు జట్టుతో కలుస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ ధీమాతో ఉన్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి మాత్రం స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్యాపిటల్స్ హెడ్కోచ్ హేమాంగ్ బదానీ మాట్లాడుతూ.. ‘సీఏ ఎన్వోసీ కోసం వేచిచూస్తున్నాం.
అది అందినాకే స్టార్క్ అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్నదానిపై స్పష్టత వస్తుంది’ అని అన్నాడు. క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. ‘స్టార్క్ వస్తాడు. సీఏ నుంచి స్పష్టత రావడమే తరువాయి. ఈ విషయంలో సీఏతో మా ఫ్రాంచైజీ ప్రతినిధులు టచ్లో ఉన్నారు. అన్నీ కుదిరితే మా తొలి మ్యాచ్ కంటే ముందే అతడు జట్టుతో కలుస్తాడు’ అని అన్నాడు.