సిడ్నీ: ఇండియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా(Australian Squad) తమ జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకుంటున్న ప్యాట్ కమ్మిన్స్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్‌కు మిచెల్ మార్ష్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 19వ తేదీ నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనున్నది. వన్డే జట్టులో ఆస్ట్రేలియా కొన్ని మార్పులు చేసింది. వన్డే స్క్వాడ్ నుంచి లబుషేన్‌ను తప్పించింది. అతని స్థానంలో మాథ్యూ రెన్షాను తీసుకున్నది. రెన్షా ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 14 టెస్టులు ఆడాడు. అయితే 2022 పాకిస్థాన్ టూరులో అతను వన్డే జట్టులో ఉన్నా.. ఇంకా అరంగేట్రం చేయలేదు. కమ్మిన్స్ లేకపోవడంతో.. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ ప్రధాన బౌలర్ల పాత్రను పోషించనున్నారు. వీరితో పాటు పేస్ బౌలింగ్ బృందంలో గ్జావియర్ బార్ట్లెట్, బెన్ డ్వార్షియస్ ఉన్నారు.
బ్యాటర్ రెన్షా గత సీజన్లో క్వీన్స్‌ల్యాండ్ తరపున భారీగా పరుగులు సాధించాడు. అతను 50 సగటుతో 350 రన్స్ చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 80, 106, 62 రన్స్ స్కోర్ చేశాడు. పెర్త్‌లో జరగనున్న ఫస్ట్ వన్డే మ్యాచ్‌కు అలెక్స్ క్యారీ దూరం కానున్నాడు. అక్టోబర్ 15వ తేదీన ఓవల్‌లో జరగనున్న షీఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఆడనున్నాడు. మణికట్టుకు సర్జరీ కావడం వల్ల గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను టీ20 సిరీస్‌ను తప్పించారు. తొలి రెండు టీ20 లకు మాత్రమే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఇండియాతో మొత్తం మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
వన్డే జట్టు: మిచెల్ మార్ష్, గ్జావియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోలీ, బెన్ డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్,జోష్ ఇంగ్లిష్, మిచెల్ ఓవన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
టీ20 జట్టు: మిచెల్ మార్ష్, సీన్ అబాట్, గ్జావియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహనెమన్, మిచెల్ ఓవన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
Introducing our Australian Men’s squads for the ODI & T20I series against India 🇦🇺 🇮🇳 pic.twitter.com/6pSGjzUL01
— Cricket Australia (@CricketAus) October 7, 2025