Sachin Tendulkar : భారత జట్టు మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ లెజెండరీ క్రికెటర్ ఫాదర్స్ డేన తన తండ్రి రమేశ్ టెండూల్కర్(Ramesh Tendulkar)ను యాది చేసుకున్నాడు. తాను గొప్ప క్రికెటర్ అవ్వడానికి కారణమైన ఆయనను ఎంతో మిస్ అవుతున్నట్టు తెలిపాడు. నాన్నతో దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన సచిన్ దానికి భావోద్వేగపూరిత క్యాప్సన్ పెట్టాడు.
‘మానాన్న మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు. మాతో కఠినంగా ఉండేవారు కాదు., భయపెట్టడం కంటే ప్రేమ కురిపించి మాకు మంచీ చెడూ చెప్పేవారు, ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పారు. నావరకైతే ఆయనే నా ప్రపంచం. మిస్ యూ.. బాబా’ అని సచిన్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
My father was loving, not strict. Instead of fear, he operated with love. He taught me so much and meant the world to me. His thinking, values and his idea of parenting were far ahead of his time.
Miss you, Baba!#FathersDay pic.twitter.com/EYt6RUiEGL
— Sachin Tendulkar (@sachin_rt) June 18, 2023
సచిన్ తండ్రి పేరు రమేశ్ టెండూల్కర్. మహారాష్ట్రలోని అలీబాగ్‌లో పుట్టిన ఆయన మరాఠీ భాషలో కవితలు, నవలలు రాసేవారు. అనతికాలంలోనే స్థానికంగా రచయిత(Marathi Author)గా పేరు తెచ్చుకున్నారు. ఉన్నత విద్య పూర్తయ్యాక ముంబైలోని క్రితి ఎమ్ దూంగుర్సీ కాలేజీలో కొన్నాళ్లు ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన 1999 మే 19వ తేదీన కన్నుమూశారు. చిన్నప్పుడే సచిన్ క్రికెట్ టాలెంట్‌ను రమేశ్ టెండూలర్ గుర్తించారు. కొడుకును ప్రోత్సహించి దేశం గర్వించదగ్గ క్రికెటర్‌ను చేశారు.
వందో సెంచరీ కొట్టాక సచిన్ అభివాదం

19 ఏళ్లకే అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సచిన్ క్రికెట్ గాడ్‌గా పేరొందాడు. 24 గజాల ఆటలో ఎన్నో అద్భుతాలు చేసిన ఈ లిటిల్ మాస్టర్ అత్యధిక పరుగులతో రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు అత్యధికంగా 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరాడు. 2011లో వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్న ఈ స్టార్ ప్లేయర్ 2013 నవంబర్ 16న క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అనంతరం ఐపీఎల్(IPL)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఆడాడు. సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో అతను కూడా ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ప్రస్తుతం సచిన్ ముంబై జట్టకు మెంటార్‌గా సేవలందిస్తున్నాడు.