టోక్యో: ఒలింపిక్స్లో ఇండియాకు తొలి మెడల్ సాధించిపెట్టిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఇండియాకు తిరుగు ప్రయాణమైంది. సోమవారం ఉదయం ఆమె ఇండియ ఫ్లైటెక్కింది. కోచ్ విజయ్ శర్మతో కలిసి ఎయిర్పోర్ట్లో ఉన్న ఫొటోను ఆమె తన ట్విటర్లో షేర్ చేసింది. ఇంటికి తిరిగి వస్తున్నాను. థ్యాంక్యూ టోక్యో. నా జీవితంలో మరచిపోలేని క్షణాలు అని ఆమె ట్వీట్ చేసింది. దీనిపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ స్పందిస్తూ.. కంగ్రాచులేషన్స్ అని ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఫ్యాన్స్ వందల కొద్దీ కామెంట్లు పెట్టారు. వేల కొద్దీ లైక్స్ వచ్చాయి. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ కలిపి 202 కేజీల బరువు ఎత్తిన ఆమె.. సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
Heading back to home 🇮🇳, Thank you #Tokyo2020 for memorable moments of my life. pic.twitter.com/6H2VpAxU1x
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 26, 2021