హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడా పాఠశాల (హకీంపేట) విద్యార్థులు గణేశ్, భాను, హేమలతను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. క్రీడా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని.. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఉజ్బెకిస్థాన్‌లో జరుగనున్న ఆసియా అండర్-17 మహిళల వాలీబాల్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు సుజాత, యామిని, రిషితను కూడా మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడా పాఠశాల ఓఎస్డీ హరికృష్ణ, స్పోర్ట్స్ అధికారి ఆర్కే బోస్, కోచ్‌లు మాణిక్యాలరావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.