Team India : ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో భారత జట్టు (Team India) అద్భుత విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక(Srilanka)పై 10 వికెట్ల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. దాంతో, టీమిండియా ఎనిమిదోసారి ఆసియా కప్ చాంపియన్గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఆసియాకప్ ఫైనల్లో ఒంటి చేత్తో టీమ్ఇండియాకు విజయం కట్టబెట్టిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్(Siraj)పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ఓవర్లో 4 వికెట్లు సహా మొత్తం 6 వికెట్లు ఖాతాలో వేసుకున్న సిరాజ్.. లంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించగా.. ఆ తర్వాత సునాయాస లక్ష్యఛేదనలో ఓపెనర్లు దంచికొట్టడంతో టీమ్ఇండియా 6.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తిచేసింది. అయితే ఈ మ్యాచ్లో సిరాజ్ ప్రదర్శనపై మంత్రి హరీష్ రావు ప్రశంసలు కురిపించాడు.
అన్ స్టాపబుల్ టీమ్ఇండియా. ఆసియా కప్ గెలిచినందుకు మెన్ ఇన్ బ్లూకి కంగ్రాట్యులేషన్స్. అలాగే తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనకు సిరాజ్కు అభినందనలు. ఆల్ ది బెస్ట్ ఫర్ వరల్డ్ కప్ అంటూ హరీష్ రావు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.
Unstoppable #TeamIndia 🇮🇳
Congratulations to Men in Blue on winning the #AsiaCup2023 🏆
Kudos to @mdsirajofficial for his outstanding bowling performance!!My best wishes for the World Cup. pic.twitter.com/Sl5HVKjkPD
— Harish Rao Thanneeru (@BRSHarish) September 17, 2023
మరోవైపు ప్రత్యర్థి వన్నులో వణుకు పుట్టించే స్పెల్ ఎలా ఉంటుందో శ్రీలంకకు సిరాజ్ చూపించాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేస్తే.. హైదరాబాదీ దెబ్బకు లంకేయుల గుండె పగిలిందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ మొదలుకొని సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, దినేశ్ కార్తీక్, ఇర్ఫాన్ పఠాన్ ఇలా ప్రతి ఒక్కరూ సిరాజ్ స్పెల్పై ప్రశంసలు కురిపించారు.