హైదరాబాద్, ఆట ప్రతినిధి: కెప్టెన్ సీవీ మిలింద్ (3/34; 29 నాటౌట్) ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకోవడంతో టీజీ 20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ జట్టు నాలుగో విజయం అందుకుంది. ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి రైజర్స్‌ను ఓడించింది. మిలింద్ బౌలింగ్ దెబ్బకు తొలుత రంగారెడ్డి 20 ఓవర్లలో 147/9 స్కోరుకే పరిమితం అయింది.
ఆదిత్య (43) టాప్ స్కోరర్. తర్వాత ఖమ్మం 17.1 ఓవర్లలోనే 150/5 స్కోరు చేసి గెలిచింది. కె. హిమతేజ (45), మికిల్ జైస్వాల్ (30)తో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిలింద్ రాణించాడు. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ 7 వికెట్ల తేడాతో కరీంనగర్ డైమండ్స్‌ను ఓడించి వరుసగా ఆరో విజయం ఖాతాలో వేసుకుంది.