జైపూర్ : మిడిలార్డర్ బ్యాటర్ తిలక్‌వర్మ ఆల్‌రౌండ్ షోతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ బోణీ చేసింది. బుధవారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌వర్మ అర్ధసెంచరీ చేయడమేగాక బౌలింగ్‌లోనూ రాణించి పొదుపుగా పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తొలుత హైదరాబాద్ 8 వికెట్లకు 147 పరుగులు చేయగా, ఛేదనలో పుదుచ్చేరి కడదాకా పోరాడి 4 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది.
హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో తిలక్‌వర్మ అర్ధసెంచరీ (41 బంతుల్లో 57; 4 సిక్సర్లు, 1 ఫోర్) చేయడమేగాక బౌలింగ్‌లో మూడు ఓవర్లలో 14 పరుగులిచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో తిలక్‌వర్మకు ఇది వరుసగా రెండో అర్ధసెంచరీ. మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తిలక్‌వర్మ 50 పరుగులు సాధించాడు.