బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై తమకు దక్కిన శుభారంభాన్ని ఉపయోగించుకోలేకపోయింది. రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) ఇద్దరూ రాణించడంతో పవర్‌ప్లేలో వికెట్లేమీ కోల్పోకుండా 49 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ (8), తిలక్ వర్మ (0), కీరన్ పొలార్డ్ (0), రమన్‌దీప్ సింగ్ (6) పూర్తిగా విఫలమయ్యారు.
మాక్స్వెల్ చేసిన అద్భుతమైన రనౌట్‌కు తిలక్ వర్మ పెవిలియన్ చేరగా.. హసరంగ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే పొలార్డ్ ఎల్బీగా అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో జయదేవ్ ఉనద్కత్ (13 నాటౌట్)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్) జట్టును ఆదుకున్నాడు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
అలాంటి సమయంలో కూడా ఎక్కడా రన్‌రేట్ పడకుండా సూర్యకుమార్ ధాటిగా ఆడటంతో 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హసరంగ, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా.. ఆకాష్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
A brilliant effort with the ball to keep the total down to 1️⃣5️⃣1️⃣. 🙌🏻
Chase coming up! 💪🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #MIvRCB pic.twitter.com/ciz080vPF9
— Royal Challengers Bangalore (@RCBTweets) April 9, 2022