ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై ఆడిన ఏ మ్యాచ్లోనూ బ్యాటుతో ఆకట్టుకోని రోహిత్.. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో కూడా తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. ఉమేష్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో కీపర్ శామ్ బిల్లింగ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్.. 12 బంతులు ఆడి కేవలం 3 పరుగులే చేసి అవుటయ్యాడు. ఉమేష్ వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ చేసేందుకు ప్రయత్నించగా.. అది టాప్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. దాన్ని కీపర్ బిల్లింగ్స్ జాగ్రత్తగా అందుకోవడంతో రోహిత్ పెవిలియన్ చేరాడు.