కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (3) ఫామ్ లేమి కొనసాగించగా.. కోల్‌కతా పేసర్ ఉమేష్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్‌తో రోహిత్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన డెవాల్డ్ బ్రెవిస్ (21 నాటౌట్), ఇషాన్ కిషన్ (10 నాటౌట్) జోడీ..
పవర్‌ప్లేలో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. ముఖ్యంగా డెవాల్డ్ తన బ్యాటుకు పనిచెప్తూ అవకాశం దొరికినప్పుడల్లా భారీ షాట్లు ఆడటంతో కేకేఆర్ బౌలర్లు పవర్‌ప్లేలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు. దీంతో తొలి ఆరు ఓవర్లలో ముంబై జట్టు వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది.