ఈ ఐపీఎల్లో భారీ అంచనాలతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఒటమి చవిచూసిన ముంబై.. ఎలాగైనా ఒక గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే బుధవారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో తలపడేందుకు సిద్ధమైంది. పూణేలోని ఎంసీఏ స్టేడియలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు.
న్యూజిల్యాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ స్థానంలో ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను, అలాగే శివమ్ మావి స్థానంలో రసిఖ్‌ను తీసుకున్నామని శ్రేయాస్ తెలిపాడు. ముంబై జట్టు కూడా రెండు మార్పులతో బరిలో దిగింది. అన్మోల్ ప్రీత్‌సింగ్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ ఆడుతున్నట్లు రోహిత్ వెల్లడించాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, శామ్ బిల్లింగ్స్, ఆండ్రి రస్సెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రసిఖ్ సలామ్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డెవాల్డ్ బ్రెవిస్, డానియల్ శామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, బసిల్ థంపి, జస్ప్రీత్ బుమ్రా.
#KKR have won the toss and they will bowl first against #MumbaiIndians
Live – https://t.co/qFLVoCfqRk #KKRvMI #TATAIPL pic.twitter.com/nn7JCyXgKG
— IndianPremierLeague (@IPL) April 6, 2022