MI vs CSK | ఐపీఎల్ సీజన్లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు స్వల్ప టార్గెట్‌ను నిర్దేశించింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి రెండు ఓవర్లు ముగిసేలోపే ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రెవిస్ (4) కూడా విఫలమయ్యాడు. కష్టాల్లో ఉన్న ముంబైని.. సూర్యకుమార్ యాదవ్ (32) ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మ (51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ముంబై జట్టుకు చెప్పుకోదగ్గ స్కోర్‌ను అందించాడు. హృతిక్ షోకిన్ (25) ఫర్వాలేదనిపించాడు. కిరెన్ పోలార్డ్ (14), డేనియల్ సామ్స్ (5), జయదేవ్ ఉనద్కత్ (19) పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 155 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు 156 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.