MI vs UPW : ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వరుస ఓవరల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఏడో ఓవర్లో యస్తికా భాటియా (42) క్యాచ్ ఔట్ అయింది. ఆ తర్వాత ఎక్లెస్టోన్ ఓవర్లో మాథ్యూస్ ఆమెకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులో ఉన్నారు. ఆ జట్టు విజయానికి 72 బంతుల్లో 101 పరుగులు కావాలి. 58 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ పడింది. 8 ఓవర్లు ముగిసే సరికి ముంబై 2 వికెట్ల నష్టానికి 58 రన్స్ చేసింది.
పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (11), ధాటిగా ఆడారు. వీళ్లు 37 బంతుల్లో 51 రన్స్ జోడించారు. ఎక్లెస్టోన్ ఓవర్లో మాథ్యూస్ ఎల్బీ కోసం యూపీ ఎల్బీకి అప్పీల్ చేసింది. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో యూపీ రివ్యూ తీసుకుంది. అయితే.. రివ్యూలో మొదట ఔట్ అని , ఆ తర్వాత నాటౌట్ అని టీవీ అంపైర్ ప్రకటించాడు.