Lasith Malinga | రోహిత్ సేనకు కొత్త బౌలింగ్ కోచ్.. రాజస్తాన్ రాయల్స్ కు భారీ షాక్
Lasith Malinga | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ కొత్త బౌలింగ్ కోచ్‌ను నియమించుకుంది.
Lasith Malinga | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ కొత్త బౌలింగ్ కోచ్‌ను నియమించుకుంది. ఇన్నాళ్లూ ఆ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న షేన్ బాండ్ ఇటీవలే ముంబైని వదిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతడి ప్లేస్‌లో వచ్చే సీజన్ నుంచి ఆజట్టుకు దశాబ్దకాలం పాటు ఆడిన శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ సేవలందించనున్నాడు. ఈ మేరకు మలింగ ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఐపీఎల్లో 2009 నుంచి 2019 వరకూ ముంబై ఇండియన్స్‌కు ఆడిన మలింగ.. 2021, 2022 సీజన్లలో రాజస్తాన్ రాయల్స్ కు బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. కానీ తాజాగా అతడు రాజస్తాన్ నుంచి తప్పుకుని ముంబై జట్టుకు తిరిగొచ్చాడు. మలింగ రాకతో ముంబై టీమ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌తో పాటు మలింగల త్రయం రీయూనిట్ అయినట్టయిందని అభిమానులు చెప్పుకుంటున్నారు.
ముంబై ఇండియన్స్ కంటే ముందే మలింగ.. సౌతాఫ్రికాలో జరిగే ఎస్ఎ 20 లీగ్‌లో ఎంఐ న్యూయార్క్ జట్టుతో పాటు యూఎస్ఎలోని మేజర్ లీగ్ క్రికెట్ లో ముంబై ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్ కూ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా అతడు ముంబై జట్టుతో కలవబోతున్నాడు.
Mumbai Indians in IPL 2024:
Captain – Rohit Sharma.
Batting coach – Kieron Pollard.
Bowling coach – Lasith Malinga.– The GOAT Trio of MI family is back…!!!! pic.twitter.com/VhrcCOXQRG
— CricketMAN2 (@ImTanujSingh) October 20, 2023
ముంబైకి తిరిగిరావడంపై మలింగ స్పందిస్తూ.. ‘ముంబై ఇండియన్స్ టీమ్ కు బౌలింగ్ కోచ్‌గా వచ్చినందుకు నాకు గర్వకారణం. వన్ ఫ్యామిలీతో నా బంధం మళ్లీ కొనసాగుతుంది. నేను మార్క్ బౌచర్ (ముంబై హెడ్‌కోచ్), పొలీ (కీరన్ పొలార్డ్), రోహిత్ లతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నా..’అని చెప్పుకొచ్చాడు. ముంబైతో గడిచిన 13 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్న మలింగ.. మొత్తంగా ఏడు ట్రోఫీ (నాలుగు ఐపీఎల్) విజయాలలో భాగస్వామిగా ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

