మెస్సీ మేనియా..
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ మరో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. సోమవారం ఇక్కడ జరిగిన గ్రూప్-జే పోరులో మెస్సీ రెండు గోల్స్ (38వ నిమిషంలో, 90+5 ని.)తో ఆ జట్టు.. 2-0తో ఆస్ట్రియాపై గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది.
- ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌తో మెస్సీ వరల్డ్ రికార్డు
- నాకౌట్‌కు అర్జెంటీనా
- 2-0తో ఆస్ట్రియాపై గెలుపు
అమెరికా గడ్డపై జరుగుతున్న ఫుట్ బాల్ మహాసంగ్రామం అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ నామస్మరణతో మార్మోగుతున్నది. గత ఎడిషన్‌లో తన దేశానికి వరల్డ్‌కప్ అందించి కల నెరవేర్చుకున్న మెస్సీలో ఇంకా కసి తీరడం లేదు. ఆరోసారి ఫిఫా కప్‌లో బరిలోకి దిగిన ఈ 38 ఏండ్ల సాకర్ మాంత్రికుడు తనను ఆరాధించే కోట్లాదిమంది అభిమానులను అద్భుత ఆటతో ఫిదా చేస్తూనే ఉన్నాడు. తొలి పోరులోనే హ్యాట్రిక్ గోల్స్‌తో ఉర్రూతలూగించిన అర్జెంటీనా వీరుడు ఆస్ట్రియాపై డబుల్ ధమాకా మోగించాడు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టిస్తూ తన జట్టును నాకౌట్‌కు చేర్చాడు.
అర్లింగ్టన్ (టెక్సాస్): అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ మరో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. సోమవారం ఇక్కడ జరిగిన గ్రూప్-జే పోరులో మెస్సీ రెండు గోల్స్ (38వ నిమిషంలో, 90+5 ని.)తో ఆ జట్టు.. 2-0తో ఆస్ట్రియాపై గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. అల్జీరియాతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన మెస్సీ.. ఆస్ట్రియాతోనూ అదే మ్యాజిక్‌ను పునరావృతం చేశాడు. ఆట ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఎదురు దాడికి దిగినా అర్జెంటీనాకు 38వ నిమిషంలో తొలి గోల్ అందించిన అతడు.. ఆట ఆఖర్లోనూ అద్భుతమైన గోల్ కొట్టి తన జట్టును తిరుగులేని స్థితిలో నిలిపాడు. తొలుత ఆస్ట్రియా గోల్‌పోస్ట్‌కు సమీపాన ఉన్న లెఫ్ట్ కార్నర్ నుంచి ఫకుండొ ఇచ్చిన బంతిని అందుకుని తనదైన ట్రేడ్‌మార్క్ కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించి తొలి గోల్ కొట్టిన ఈ సాకర్ దిగ్గజం.. ఆట ముగుస్తుందనగా మరో గోల్‌తో ఈ టోర్నీలో మరెవరికీ సాధ్యం కాని విధంగా 18 గోల్స్ సాధించాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో జర్మనీ ఆటగాడు మిరాస్లొవ్ క్లోస్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో (15), కిలియన్ ఎంబాపె (14) తదుపరి స్థానాల్లో ఉన్నారు.
18 వరల్డ్ కప్స్‌లో మెస్సీ కొట్టిన గోల్స్. 16 గోల్స్‌తో ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న జర్మనీ దిగ్గజం మిరాస్లొవ్ క్లోస్ రికార్డును బ్రేక్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

