బార్సిలోనాకు బైబై
మాడ్రిడ్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ బార్సిలోనాకు కన్నీటి వీడ్కోలు పలికాడు. 17 ఏండ్లుగా ఆ జట్టు తరఫున ఆడిన మెస్సీ.. ఫేర్వెల్ సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు. బార్సిలోనాతో ఉండటానికి చివరివరకు ప్రయత్నించానని చెప్పిన ఈ అర్జెంటీనా స్టార్.. జట్టును వీడటం చాలా కష్టంగా ఉందన్నాడు. దీనికి తాను సిద్ధంగా లేనని చెప్పుకుంటూ ఏడ్చేశాడు. బార్సిలోనాతో తన ప్రయాణం ముగిసిందని తెలియగానే ఇతర ఫుట్‌బాల్ క్లబ్‌లు తనను సంప్రదించాయని చెప్పిన మెస్సీ.. భవిష్యత్తులో ఏ జట్టు తరఫున ఆడేది మాత్రం స్పష్టం చేయలేదు. మెస్సీ 17వ ఏట (2004) నుంచి బార్సిలోనా తరఫునే ఆడుతున్నాడు. ఆ జట్టుకు 778 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 672 గోల్స్‌తో ఆల్‌టైమ్ లీడింగ్ స్కోరర్‌గా ఉన్నాడు.