Lionel Messi : అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi)మరో అవార్డుపై గురి పెట్టాడు. ప్రతిష్ఠాత్మక యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్(UEFA) ‘ప్లేయర్ ఆఫ్ ది అవార్డు’ రేసులో నిలిచాడు. నిరుడు వరల్డ్ కప్(ODI WC 2022) ట్రోఫీ గెలిచిన ఈ స్టార్ ఆటగాడు పురుషుల విభాగంలో యూఈఎఫ్ఏ 2022-23 అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ బహుమతి కోసం మాంచెస్ట్ సిటీ మిడ్‌ఫీల్డర్ కెవిన్ డి బ్రుయనే(Kevin De Bruyne), నార్వే స్ట్రయికర్ ఎర్లింగ్ హోలాండ్(Erling Haaland)లు మెస్సీతో పోటీ పడుతున్నారు.
ఈ ఏడాదిలో క్లబ్, దేశం తరఫున ఈ ముగ్గురు అత్యుత్తమ ప్రదర్శన చేశారని, అందుకనే వీళ్లను నామినేట్ చేశామని యూఈఎఫ్ఏ సాంకేతిక అధ్యయన బృందం తెలిపింది. ఈ ముగ్గురిలో విజేత ఎవరో ఆగస్టు 31న ప్రకటిస్తారు. అదే రోజు యూఈఎఫ్ఏ 2023-24 చాంపియన్ లీగ్ గ్రూప్ స్టేజ్ డ్రా వేడుక జరుగనుంది.
✨ UEFA Men’s Player of the Year ✨
𝟮𝟬𝟮𝟮/𝟮𝟯 𝗡𝗢𝗠𝗜𝗡𝗘𝗘𝗦
🇧🇪 De Bruyne
🇦🇷 Messi
🇳🇴 Haaland🏆 #UEFAawards winners announced at the #UCLdraw, 31 August 2023 🗓️ pic.twitter.com/onxVvNMLpi
— UEFA Champions League (@ChampionsLeague) August 17, 2023
ఈ ఏడాది సీజన్ ఆరంభంలో మెస్సీ పారిస్ సెయింట్ జర్మనీ(PSG) క్లబ్‌ను వీడాడు. అమెరికాకు చెందిన ఇంటర్ మియామి (Inter Miami) క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఆ జట్టు తరఫున లీగ్స్ ప్లోదుమ్మురేపుతున్నాడు. తన అద్భుత ఆటతో ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. మాంచెస్ట్ సిటీ తరఫున మిడ్‌ఫీల్డర్ కెవిన్ డి బ్రుయనే, ఎర్లింగ్ హోలాండ్‌లు గొప్పగా రాణించారు. నిరుడు ప్రీమియర్ లీగ్, చాంపియన్స్ లీగ్, ఎఫ్ఏ కప్ గెలవడలో కీలక పాత్ర పోషించారు.
లియోనల్ మెస్సీ
ఈ అవార్డు కోసం 2022 వరల్డ్ కప్ హ్యాట్రిక్ హీరో కిలియన్ ఎంబాపే(Kylian Mbappe), క్రొయేషియా కెప్టెన్ ల్యూకా మొర్డిక్(Luka Modric) పోటీ పడ్డారు. వీళ్లతో పాటు మార్సెలో బ్రొజోవిక్, డెక్లాన్ రైస్, అలెక్సిస్ మ్యాక్ అలిస్టర్, జీసస్ నవాస్ వంటి స్టార్ ఆటగాళ్లు పోటీ పడినా చివరకు నామినేట్ కాలేకపోయారు.