మెల్బోర్న్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య క్రికెట్(Test Cricket) బంధానికి 150 ఏళ్లు నిండింది. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లు డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. 2027 మార్చి 11 నుంచి 15వ తేదీ వరకు ఆ మ్యాచ్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్నది. సుమారు లక్ష మంది ప్రేక్షకులు ఆ మ్యాచ్‌ను వీక్షిస్తారు. ఈ రెండు జట్లు మొట్టమొదటిసారి 1877లో ఎంసీజీ వేదికగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 45 రన్స్‌తో విజయం సాధించింది. అయితే అదే వేదికపై రెండో టెస్టును ఇంగ్లండ్ గెలుచుకున్నది. దీంతో ఆ సిరీస్ 1-1తో సమం అయ్యింది.
రెండు జట్ల మధ్య వందో టెస్టును కూడా ఎంసీజీలోనే నిర్వహించారు. 1977లో ఆ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. 150వ వార్షిక టెస్టును ఎంసీజీలో గొప్ప నిర్వహిస్తామని, లైట్ల వెలుతురులో టెస్టు ఆడడం అద్భుతంగా ఉంటుందని, ఆధునిక టెస్టు క్రికెట్ రూపాంతరం చెందుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్ తెలిపారు. 150వ టెస్టు జీవితకాల స్మృతులను మిగుల్చుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 13 డే అండ్ నైట్ టెస్టులు మ్యాచ్‌లు ఆడగా, దాంట్లో 12 మ్యాచుల్లో ఆ జట్టు విజయం సాధించింది.
Arch-rivals Australia and England will contest in a day-night Test at the MCG to mark 150th anniversary of the longest format 🏏https://t.co/2QOCDbZNii
— ICC (@ICC) March 11, 2025