Brendon McCullam : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు క్లైమాక్స్ అదిరిపోయింది. గెలుస్తామనే ధీమాతో ఉన్న ఇంగ్లండ్ అనూహ్యంగా ఐదో రోజు 56 నిమిషాల్లోనే కుప్పకూలింది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో భారత జట్టు చరిత్రాత్మక విజయంతో సిరీస్ సమం చేసింది. సిరీస్ ఆసాంతం అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. అయితే.. ఈ అవార్డును పేసర్ సిరాజ్‌కు ఇవ్వాల్సింగా ఇంగ్లండ్ హెడ్‌కోచ్ మెక్కల్లమ్ (McCullam) అభిప్రాయపడ్డాడట. ఈ విషయాన్ని మంగళవారం కామెంటేటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) వెల్లడించాడు.
ఓవల్ టెస్టు నాలుగో రోజునే ముగిసి ఉంటే శుభ్‌మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచేవాడు. కానీ వర్షం, వెలుతురు లేమి కారణంగా ఆట ఐదో రోజుకు వెళ్లింది. ఇంగ్లండ్‌కు 35 రన్స్ అవసరం కాగా.. భారత్‌కు 4 వికెట్లు కావాలి. ఈ దశలో ఒకేఒక్కడు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో మూడు వికెట్లు తీసిన సిరాజ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అందుకే.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌కు అతడే అర్హుడని మెక్కల్లమ్ భావించాడని కార్తిక్ అన్నాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను అతడు వివరించాడిలా.
Captain Shubman Gill with the England coach Brendon McCullum after the match yesterday. ❤️ pic.twitter.com/rdSbp6jRwH
— Ahmed Says (@AhmedGT_) August 5, 2025
‘ఒక ఫాస్ట్ బౌలర్లో ఉండాల్సిన కసి, కచ్చితత్వం సిరాజ్‌లో ఉన్నాయి. అతడు బంతి అందుకున్న ప్రతిసారి ఎంతో ఎనర్జీగా కనిపించాడు. జట్టును గెలిపించేందుకు తన శక్తినంతా ధారపోసేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ మ్యాచ్‌ను మలుపు తిప్పే స్పెల్స్ వేశాడు. ఈరోజు ఓవల్‌లో కూడా అదే విధంగా మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడీ పేసర్. మొత్తంగా 23 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. అందుకే నా దృష్టిలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డుకు గిల్ కంటే సిరాజ్ అన్ని విధాలా అర్హుడు’ అని మెక్కల్లమ్ చెప్పాడు. ఇంగ్లండ్ కోచ్ అన్నట్టే ఈ సిరీస్‌లో నిజమైన హీరో అంటే సిరాజే.
On the final morning of the fifth Test, it was CR7 who was on Siraj’s mind after he woke up restless at 6am instead of the usual 8am 🤝 pic.twitter.com/Vm27ArTQMx
— ESPNcricinfo (@ESPNcricinfo) August 5, 2025
ప్రధాన పేసర్ బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ యూనిట్‌కు దళపతిగా వ్యవహరించిన మియా భాయ్ సహచరులను వెన్నుతట్టి నడిపాడు. అలుపన్నదే తెలియదన్నట్టు ఐదు టెస్టులు ఆడిన సిరాజ్185.5 ఓవర్లు (1,113 బంతులు) బౌలింగ్ చేశాడు. ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడీ హైదరాబాదీ. నాలుగో రోజు 19 పరుగుల వద్ద బ్రూక్ క్యాచ్‌ను జారవిడిచి విమర్శల పాలైన మియా భాయ్.. ఐదో రోజు గేమ్ ఛేంజర్ అయ్యాడు. తన శక్తిని చాటుతూ భారత్‌కు అపూర్వ విజయాన్ని అందించి తనదైన స్టయిల్లో సంబురాలు చేసుకున్నాడీ పేస్ గన్.