ముంబై : ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఎన్నో చారిత్రక సందర్భాలకు వేదికైన వాంఖడే స్టేడియం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. వాంఖడే నిర్మించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్సీఏ మొత్తం 14, 505 తెలుపు, ఎరుపు బంతులతో ‘ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం’అని ఇంగ్లిష్ వ్యాఖ్యాన్ని స్టేడియంలో తీర్చిదిద్దారు.