Kylian Mbappe | పారిస్: ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ)తో ఏడేండ్ల బంధాన్ని త్వరలో తెంచుకోనున్న ఫ్రెంచ్ ఫుట్‌బాల్ యువ సంచలనం కిలియన్ ఎంబాపె.. ఆ జట్టు తరఫున చివరి హోమ్ గేమ్ ఆడేశాడు. పారిస్‌లోని పార్క్ డి ప్రిన్సెస్ వేదికగా ఆదివారం రాత్రి పీఎస్జీ.. 1-3 తేడాతో టోలోస్ ఫుట్‌బాల్ క్లబ్ చేతిలో ఓడినా ఈ మ్యాచ్‌లో ఎంబాపె ఓ గోల్ కొట్టాడు.
2017లో పీఎస్జీతో ఒప్పందం కుదుర్చుకున్న అతడు.. ఈ క్లబ్ తరఫున మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న అవి ఇతర వేదికల్లో జరగాల్సి ఉంది. ఇదివరకే రియల్ మ్యాడ్రిడ్తో ఒప్పందం కుదుర్చుకున్న ఎంబాపె.. జూన్ 1న ఆ జట్టుకు తొలి మ్యాచ్ ఆడే అవకాశముంది.