బెంగుళూరు: లక్నో సూపర్ గెయింట్స్ బౌలర్ మయాంక్ యాదవ్(Mayank Yadav).. తన స్పీడ్‌తో థ్రిల్ చేస్తున్నాడు. మేటి బ్యాటర్లను వణికిస్తున్నాడు. ఐపీఎల్లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కళ్లు చెదిరే రీతిలో బౌలింగ్ చేశాడు. బెంగుళూరు బ్యాటర్ కెమరూన్ గ్రీన్‌ను మయాంక్ బౌల్డ్ చేసిన స్టయిల్ స్టన్నింగ్‌గా ఉంది. ఆ బంతిని అతను 156.7 కిలోమీటర్ల వేగంతో వేశాడు. ఆఫ్ స్టంప్‌పై వేసిన ఆ బంతి.. గ్రీన్ డిఫెన్స్‌ను చేధించుకుంటూ నేరుగా వెళ్లి వికెట్లను ఢీకొట్టింది.182 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. గ్రీన్ వికెట్ కోల్పోవడంతో దాదాపు చేతులెత్తేసింది. కామెంటరీ ఇస్తున్న రవి శాస్త్రి ఆ బంతిని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. లక్నో పేసర్ మయాంక్ 156.7 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసింది. అయితే ఈ ఎడిషన్‌లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీ కావడం విశేషం. టోర్నమెంట్ హిస్టరీలో మాత్రం ఇది నాలుగవ ఫాస్టెస్ట్ బంతి కావడం గమనార్హం. ఆర్సీబీతో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్, గ్రీన్, పటిదార్ వికెట్లను మయాంక్ తీశాడు.
Cameron Green bowled by Mayank yadav with 156.7 kmh #LSGvsRCB #T20WorldCuppic.twitter.com/KNMgzidkKX
— ShivRaj Yadav (@shivayadav87_) April 2, 2024