Mayank Agarwal | అగర్తాల: కర్ణాటక రంజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. రంజీల్లో భాగంగా త్రిపురపై విజయం సాధించిన కర్ణాటక టీమ్‌తో అగర్తాల నుంచి ఢిల్లీకి బయల్దేరిన మయాంక్ అనారోగ్యం పాలయ్యాడు. విమానం బయల్దేరే సమయానికి వాంతులు చేసుకోవడంతో వెంటనే దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
ప్రస్తుతం అతని పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మయాంక్ అనారోగ్యంతో వచ్చే నెల 2నుంచి సూరత్‌లో రైల్వేస్‌తో మ్యాచ్ కు దూరమయ్యాడు. మయాంక్ స్థానంలో నికిన్ జోస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.