IPL 2024 RCB vs LSG : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తొలి వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్(20) ఔటయ్యాడు. 53 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ పడింది. దేవ్‌దత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (32)ఎడాపెడా బౌండరీలు బాదుతున్నాడు.
లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టాప్లే వేసిన తొలి ఓవర్లే డికాక్ మూడు బౌండరీలతో తన ఉద్దేశాన్ని చాటాడు. ఇక సిరాజ్ బౌలింగ్‌లో ఏకంగా రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అనంతరం యశ్ దయాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. దాంతో, జట్టు పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.
Dual MAXIMUMS 💥💥
Super start from @LucknowIPL and Quinton de Kock!
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uxxiqdV4cL
— IndianPremierLeague (@IPL) April 2, 2024