Max Verstappen : ఫార్ములా వన్ దిగ్గజం, వరల్డ్ చాంపియన్ మాక్స్ వెర్స్టప్పన్(Max Verstappen) సౌదీ అరేబియన్ గ్రాండ్ప్రిక్స్(Saudi Arabian GP)లో దుమ్మరేపాడు. జెడ్డాలో శనివారం జరిగిన పోరులో ఈ రెడ్ బుల్ డ్రైవర్ తన వేగానికి తిరుగు లేదని చాటాడు. రేసింగ్ కారును ఓ రేంజ్లో పరుగులు పెట్టించి వరుసగా రెండో విజయం నమోదు చేశాడు.
తన జట్టుకే చెందిన మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ కంటే 13 సెకన్ల ముందే ఫినిషింగ్ లైన్ చేరాడు. మరోవైపు ఫెరారీ డ్రైవర్ ఒలీవర్ బీర్మన్(Oliver Bearman) అరంగేట్రం రేసులోనే ఆకట్టుకున్నాడు. కార్లోస్ సైన్జ్ స్థానంలో బరిలోకి దిగిన ఒలీవర్.. తన సూపర్ డ్రైవింగ్ స్కిల్స్‌తో ఆరు పాయింట్లు సాధించాడు.
Ollie’s overtake on Nico had his dad PUMPED! 🥳#F1 #SaudiArabianGP pic.twitter.com/OsfP4HcZgv
— Formula 1 (@F1) March 9, 2024
లాండో నోరిస్(మెక్లారెన్)తో కలిసి బ్రిటన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మాజీ చాంపియన్ లెవిస్ హామిల్టన్ (Lewis Hamilton)9వ స్థానంతో నిరాశపరిచాడు.