Rathnam | విశాల్ రత్నం ఫస్ట్ సింగిల్ Dont Worry Da Machi వచ్చేసింది..
Rathnam | విశాల్ (Vishal) ప్రస్తుతం విశాల్ 34 (Vishal 34)తో బిజీగా ఉన్నాడు. రత్నం (Rathnam) టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ లుక్‌లో.. లారీలో నుంచి ఆవేశంతో దిగిన విశాల్ కత్తి చేత పట్టి శత్రువులను చీల్చి్ చెండాడుతున్న స్టిల్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
Rathnam | తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో ఒకడు విశాల్ (Vishal). ఎప్పుడూ ఏదో ఒక సినిమా అప్డేట్తో అభిమానులు, మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తుంటాడు విశాల్. ఈ హీరో ప్రస్తుతం విశాల్ 34 (Vishal 34)తో బిజీగా ఉన్నాడు. రత్నం (Rathnam) టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ లుక్‌లో.. లారీలో నుంచి ఆవేశంతో దిగిన విశాల్ కత్తి చేత పట్టి శత్రువులను చీల్చి్ చెండాడుతున్న స్టిల్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
తాజాగా మేకర్స్ రత్నం ఫస్ట్ సింగిల్ Dont Worry Da Machiను విడుదల చేశారు. వివేక రాసిన ఈ పాటను డీఎస్పీ కంపోజిషన్‌లో స్వయంగా పాడాడు. ఈ పాట నెట్టింటిని షేక్ చేస్తోంది. రత్నం ఇంట్రెస్టింగ్ లుక్, ఫస్ట్ షాట్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తూ సినిమాపై క్యూరియాసిటీ అంచనాలు పెంచుతోంది. ఇక విశాల్ 34 అనౌన్స్ మెంట్ పోస్టర్లో చుట్టూ గన్స్, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్ ఉన్న లుక్ మాస్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. విశాల్ కెరీర్లో మొదటి సారి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేస్తుండటం విశేషం. డీఎస్పీ జర్నీతో డిజైన్ చేసిన విశాల్ 34 వీడియో ఒకటి ఇప్పటికే ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న రత్నం సినిమాకు హరి (Hari)దర్శకత్వం వహిస్తున్నాడు. భరణి, పూజ సినిమాల తర్వాత హరి-విశాల్ కాంబోలో మూడో సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. రత్నంలో ప్రియా భవానీ శంకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసు దేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతోంది. మరోవైపు తుప్పరివాలన్2 కూడా విశాల్ ఖాతాలో ఉంది.
#Rathnam first single #DontWorryDaMachi streaming now – fun beats, jolly vibe and motivational lines from @ThisIsDSP
👇👇👇https://t.co/cpsEsX0S3t@VishalKOfficial‘s #Rathnam in theatres on April 26th!pic.twitter.com/p3a5kttvZF— Rajasekar Russalayan (@iamrajesh_pov) March 10, 2024
రత్నం ఫస్ట్ షాట్..
Presenting the FIRST SHOT of #Rathnam starring Puratchi Thalapathy @VishalKOfficial.
Telugu ▶️ https://t.co/dMHxN6Agr1
A film by #Hari. Coming to theatres, summer 2024.@priya_Bshankar @ThisisDSP @stonebenchers @ZeeStudiosSouth @mynnasukumar #TSJay @dhilipaction… pic.twitter.com/59LvdkCWWz
— BA Raju’s Team (@baraju_SuperHit) December 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

