హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌కు చెందిన మాస్టర్ అర్మాన్ నజీముద్దీన్ రెండు పసిడి పతకాలతో సత్తాచాటాడు. ప్రస్తుతం కవిత తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతున్న అర్మాన్..గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒకటవ ఏషియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో టోర్నీలో అండర్-14 కేటగిరీలో స్వర్ణాలతో మెరిశాడు.
బ్లాక్‌బెల్ట్ డాన్-2 హోదా కల్గిన అర్మాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ యువ తైక్వాండో ప్లేయర్ విజయం సహచరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అతని కోచ్‌లు పేర్కొన్నారు.