Mary Kom : భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్(Mary Kom) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన ఆమె తన వివాహ బంధానికి ముగింపు పలికేందుకు సిద్ధమైంది. భర్త కరుంగ్ ఒంఖెలర్ (Karung Onkholer)తో విభేదాల కారణంగా.. అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది మణిపూర్ మణిపూస. దాంతో, ఈ జంట త్వరలోనే డైవొర్స్ తీసుకోనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. 20 ఏళ్లు అన్యోన్యంగా ఉన్న వీళ్లు.. హఠాత్తుగా బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే..
మూడేళ్ల క్రితం జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నిక(Manipur Assembly Elections)ల్లో మేరీకోమ్ భర్త కరుంగ్ పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత నుంచి మేరీకి, అతడికి పొసగడం లేదు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని సమాచారం. దాంతో, కొంతకాలంగా ఇరువురు విడిగా ఉంటున్నారు. కానీ, ఇప్పటివరకూ విడాకులకు మాత్రం దరఖాస్తు చేయలేదు ఈ జంట.
Mary Kom Decides to Divorce After 20 Years of Marriage – Here’s What We Know https://t.co/sR7UPkUZKC pic.twitter.com/bG1wl1gVRk
— BollyWoodTime (@BwoodTime) April 8, 2025
భర్తతో ఉండడం ఇష్టంలేని బాక్సర్.. అతడితో 20 ఏళ్ల వైవాహిక జీవితాన్నిముగించాలని అనుకుందట. అందుకే.. తన ముగ్గురు పిల్లలను తీసుకొని ఫరీదాబాద్‌కు వెళ్లింది. ప్రస్తుతం కరుంగ్ ఢిల్లీలో ఉంటున్నాడు. అయితే.. మేరో కామ్ ఒక మహిళా బాక్సర్ భర్తతో డేటింగ్లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ ఎంత వరకు నిజం? అనేది మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి వచ్చిన మేరీకోమ్ ప్రపంచ బాక్సింగ్‌లో తన ముద్ర వేసింది. విశ్వ వేదికలపై యావత్ భారతం గర్వించదగ్గ విజయాలు సాధించింది. రింగ్‌లో తన పవర్ పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేసిన ఆమె ఏకంగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ గెలుపొందింది. 2012లో లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో కాంస్యం (Broze Medal)తో చరిత్ర సృష్టించిన మేరీ.. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. బాక్సింగ్ లెజెండ్‌గా పేరొందిన ఆమె.. అనుకోకుండా ప్యారిస్ ఒలింపిక్స్‌కు ముందు చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి వైదదొలిగింది. అయితే.. తను ఇంకా ఆటకు మాత్రం వీడ్కోలు పలకలేదు.