BANW vs ENGW : మహిళల వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పేసర్ మరుఫా అక్తర్(Marufa Akter) నిప్పులు చెరుగుతోంది. తొలి పోరులో పాకిస్థాన్‌పై మొదటి ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఈ స్పీడ్‌స్టర్.. స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్‌కు భారీ షాకిచ్చింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ అమీ జోన్స్(1)ను ఎల్బీగా వెనక్కి పంపింది. దాంతో.. 6 పరుగులకే ఇంగ్లండ్ మొదటి వికెట్ పడింది. ప్రస్తుతం హీథర్ నైట్ (4 నాటౌట్), టమ్మీ బ్యూమంట్(7 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లకు స్కోర్..15/1. ఇంకా ఇంగ్లండ్ విజయానికి 164 పరుగులు కావాలి.
వరల్డ్ కప్ 8వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 180 లోపే కట్టడి చేసిన ఇంగ్లండ్ ఛేదనలో తడబడుతోంది. మొదటి ఓవర్లోనే మరుఫా అక్తర్ సూపర్ డెలివరీతో ఓపెనర్ అమీ జోన్స్(1)ను ఎల్బీగా వెనక్కి పంపింది. అనంతరం.. నహిదా అక్తర్ ఓవర్లో టమ్మీ బ్యూమంట్(7 నాటౌట్) కూడా ఔటయ్యేది. ఆఫ్‌సైడ్ డిన బంతిని క్యాచ్ అందుకోలేకపోయింది మరుఫా. ఒకవేళ ఆ క్యాచ్ పట్టిఉంటే 6 పరుగుల వద్దే ఇంగ్లండ్ రెండో వికెట్ కూడా పడేది.
Marufa Akter strikes in the very first over! 🇧🇩⚡
Amy Jones departs for 1(3) & Bangladesh gets off to a good start. 💥
🏴 – 6/1 (1)#MarufaAkter #CWC25 #ENGWvBANW #Sportskeeda pic.twitter.com/N54tzLYYyx
— Sportskeeda (@Sportskeeda) October 7, 2025
ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ విఫలం కాగా బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇంగ్లిష్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న శోభన మొస్త్రే(60) అర్ధ శతకంతో రాణించింది. ఆఖర్లో రబెయా ఖాన్(43) మెరుపులతో బంగ్లా కోలుకుంది. స్మిత్ వేసిన చివరి ఓవర్లో రబెయా సిక్స్, ఫోర్ బాది హాప్ సెంచరీకి చేరువైంది. కానీ, షజిందా అక్తర్ ఔట్ కావడంతో 178కే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది.