IND vs AUS : వర్షం అంతరాయం నడుమ సాగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా (Australia) అలవోక విజయం సాధించింది. స్వదేశంలో బౌలర్లు రెచ్చిపోవడంతో.. టీమిండియాకు స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన ఆసీస్.. వికెట్ల తేడాతో గెలుపొందింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం నిర్దేశించిన 131 పరుగుల ఛేదనలో కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్).. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్పే(37)లు రాణించారు. ఫిలిప్పే ఔటైనా మ్యాట్ రెన్షా(21 నాటౌట్) దూకుడుగా ఆడడంతో.. 21.1 ఓవర్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో మూడువన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కంగారూ టీమ్.
భారీ అంచనాలతో అస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు షాక్. తొలి వన్డేలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆసీస్ భారీ విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 26 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టీమిండియాను కట్టడి చేసిన కంగారూ జట్టు.. అనంతరం లక్ష్యాన్ని అలవోకగా ఊదిపడేసింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్).. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్పే(37)లు ధనాధన్ ఆడగా.. కుర్రాడు మ్యాట్ రెన్షా( 21 నాటౌట్) దంచేయగా 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
Australia win the 1st ODI by 7 wickets (DLS method). #TeamIndia will look to bounce back in the next match.
Scorecard ▶ https://t.co/O1RsjJTHhM#AUSvIND pic.twitter.com/0BsIlU3qRC
— BCCI (@BCCI) October 19, 2025
పెర్త్‌లోని ఆప్టస్ మైదానంలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 136 రన్స్ చేయగా.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 26 ఓవర్లలో 131గా నిర్ణించారు. స్వల్ప ఛేదనలో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే షాకిచ్చాడు అర్ష్‌దీప్ సింగ్. రెండో ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను (8) ఔట్ చేశాడు. ఆఫ్‌సైడ్‌లో బౌండరీకి యత్నించిన హెడ్ బౌండరీ వద్ద హర్షిత్ రానా చేతికి చిక్కాడు. దాంతో. 10 పరుగులకే ఆసీస్ తొలి వికెట్ పడింది. అనంతరం కెప్టెన్ మిచెల్ మార్ష్(46 నాటౌట్), మాథ్యూ షార్ట్(8) ఇన్నింగ్స్ నిర్మించి జట్టు స్కోర్ 40 దాటించారు. అయితే.. స్పిన్నర్‌ను రంగంలోకి దింపిన శుభ్‌మన్ గిల్ వ్యూహం ఫలించింది.
A comfortable W for Australia ✅#AUSvIND scorecard: https://t.co/Ssog8B9060 pic.twitter.com/WdnZ9HpFzY
— ESPNcricinfo (@ESPNcricinfo) October 19, 2025
కట్ షాట్ ఆడిన షార్ట్.. థర్డ్ మ్యాన్‌లో రోహిత్ చేతికి సులువైన క్యాచ్ ఇచ్చాడు. దాంతో.. 44 వద్ద కంగారూ టీమ్ రెండో వికెట్ కోల్పోయింది. వెంటనే మరో వికెట్ తీసి కంగారూలను ఒత్తిడిలో పడేయాలనుకున్న భారత కెప్టెన్ వ్యూహం పారలేదు. మార్ష్ జతగా.. ఫిలిప్పే బౌండరీలతో చెలరేగాడు. దాంతో.. ఆసీస్ స్కోర్‌బోర్డు పరుగులు తీసింది. మూడో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయాన్ని సుందర్ విడదీశాడు. అప్పటికీ ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలోనే ఉంది. ఆ తర్వాత వచ్చిన మ్యాట్ రెన్షా (౦) సైతం దంచేయగా.. 21.1 ఓవర్లోనే ఆసీస్ విజయం సాధించింది.
వర్షం అంతరాయాల నడుమ జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ మొదలైంది. ఆరంభంలోనే రోహిత్ శర్మ(8)ను ఔట్ చేసి ఆసీస్‌కు బ్రేకిచ్చాడు హేజిల్‌వుడ్. క్రీజులో కుదురుకునేలా కనిపించిన విరాట్ కోహ్లీ(0)ని మిచెల్ స్టార్క్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(10) శ్రేయాస్ అయ్యార్(11)లు సైతం ఎక్కువ సేపు నిలవలేదు. 45కే నాలుగు వికెట్లు పడిన దశలో కేఎల్ రాహుల్(38), అక్షర్ పటేల్(31) ఆపద్భాదంవుల పాత్ర పోషించారు.
KL Rahul top scores as India put out a fighting total in a rain affected innings 🌧️ pic.twitter.com/loayk1dSVW
— ESPNcricinfo (@ESPNcricinfo) October 19, 2025
కంగారూ పేస్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్న అక్షర్‌ను కుహ్నేమాన్ ఔట్ చేయగా.. మరింత కష్టాల్లో పడింది టీమిండియా. అయితే.. వాషింగ్టన్ సుందర్(10), నితిశ్ కుమార్ (19 నాటౌట్)ల జతగా జట్టు స్కోర్ 120 దాటించాడు రాహుల్. టెయిలెండర్లు విఫలమవ్వడంతో 26 ఓవర్లలో భారత్ 9 వికెట్లు కోల్పోయి 131 రన్స్ కొట్టింది.