RR vs LSG | మార్ష్, ఇంగ్లిస్ విధ్వంసం.. రాజస్థాన్ ఆశలన్నీ వైభవ్ మీదే..!
RR vs LSG : ప్లే ఆఫ్స్ రేసులోని జట్ల అవకాశాల్ని దెబ్బతీస్తున్న లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కు షాకిచ్చేలా ఉంది. జైపూర్‌లో ఓపెనర్లు మిచెల్ మార్ష్(96), జోష్ ఇంగ్లిస్(60)ల విధ్వంసంతో లక్నో భారీ స్కోర్ కొట్టింది.
RR vs LSG : ప్లే ఆఫ్స్ రేసులోని జట్ల అవకాశాల్ని దెబ్బతీస్తున్న లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కు షాకిచ్చేలా ఉంది. జైపూర్‌లో ఓపెనర్లు మిచెల్ మార్ష్(96), జోష్ ఇంగ్లిస్(60)ల విధ్వంసంతో లక్నో భారీ స్కోర్ కొట్టింది. రాజస్థాన్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ ద్యయం పవర్ ప్లేలోనే స్కోర్ 80 దాటించి గుబులు పుట్టించింది. పూరన్ విఫలమైనా.. ఆఖర్లో కెప్టెన్ పంత్(35) బ్యాట్ ఝులిపించగా రాజస్థాన్‌కు 221 పరుగుల కఠినమైన సవాల్ విసిరింది లక్నో.
టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్(96), జోష్ ఇంగ్లిస్(60)లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. జైపూర్ మైదానంలో ప్రేక్షకులను అలరిస్తూ రాజస్థాన్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ ఇద్దరూ పోటీపడి బౌండరీలు బాదారు. దాంతో, పవర్ ప్లలోనే స్కోర్ 80 దాటింది. పిడుగుల్లే విరుచుకుపడిన ఇంగ్లిస్‌ను బౌల్డ్ చేసిన యశ్ రాజ్ ఎట్టకేలకు ఈ జోడీని విడదీసి రాజస్థాన్‌కు ఉపశనమనమిచ్చాడు.
4️⃣th fifty-plus score in his last 5️⃣ innings 💥
Mitchell Marsh in 𝘂𝗻𝘀𝘁𝗼𝗽𝗽𝗮𝗯𝗹𝗲 𝗺𝗼𝗱𝗲 😎
Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/9X22hmN3VU
— IndianPremierLeague (@IPL) May 19, 2026
ఇంగ్లిస్ ఔటైనా మార్ష్ జోరు తగ్గించలేదు. రాజస్థాన్ పేలవ ఫీల్డింగ్ కూడా కలిసి రావడంతో.. పూరన్(16), కెప్టెన్ రిషభ్ పంత్(35)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన మార్ష్ స్కోర్ రెండొందలు దాటించాడు. కానీ, ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్లో మార్ష్, పంత్ రనౌటవ్వగా.. అయుశ్ బదొని(0) బౌల్డయ్యాడు. టపటపా మూడు వికెట్లు పడడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

