న్యూఢిల్లీ: అరంగేట్రం ఇండియన్ గ్రాండ్ ప్రి రేసులో మార్క్ బెజెచీ విజేతగా నిలిచాడు. ఆదివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో మూనీ వీఆర్46 రేసింగ్ టీమ్ చెందిన మార్కో టైటిల్ విజేతగా నిలిచాడు. జార్జ్ మార్టిన్, ఫ్రాన్సెస్కో బగ్నానియా పోడియం ఫినిష్ చేశారు.
బుద్ధ ఇంటర్నేషనల్ సర్యూట్ జరిగిన రేసులో తొలుత ప్రైమ పారమాక్ చెందిన మార్టిన్ ఆధిక్యం కనబరిచినా..టర్న్-1 వద్ద మార్కో టాప్ దూసుకొచ్చాడు. అక్కణ్నుంచి ఏ మాత్రం వెనుకకు తగ్గని మార్కో ఎనిమిది సెకన్ల సమయం ఉండగానే లక్ష్యాన్ని ముద్దాడాడు.