బ్రిడ్జ్‌టౌన్: టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తొలి విక్టరీ నమోదు చేసింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 రన్స్ తేడాతో ఆసీస్ విజయం సాధించింది. బ్యాటర్ మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కెన్సింగ్టన్ ఓవర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్ 36 బంతుల్లో 67 రన్స్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్ 56 రన్స్ స్కోర్ చేశాడు. ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ వికెట్లను త్వరగా కోల్పోయింది. కానీ స్టోయినిస్ డేరింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టోయినిస్ ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 రన్స్ చేసింది. స్టోయినిస్ మూడు వికెట్లు తీసుకోగా, జంపా, ఎలిస్, స్టార్క్‌లు చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ విక్టరీతో గ్రూపు బిలో ఆస్ట్రేలియా రెండు పాయింట్లు, నెట్‌రన్‌రేట్‌తో టాప్‌లో ఉన్నది.
Australia get their #T20WorldCup 2024 campaign rolling with a comfortable win over Oman in Barbados 🙌#AUSvOMA ➡ https://t.co/e24jet7cMz pic.twitter.com/fFY9MesH4v
— T20 World Cup (@T20WorldCup) June 6, 2024