ట్రినిడాడ్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) ఆఫ్ఘానిస్థాన్ టాప్ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్‌కు సఫారీ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ గుర్బాజ్ వికెట్నుతీసిన మార్కో జాన్సెన్ కాబూలీలను దెబ్బతీశాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లను కుదురుకోనివ్వని సఫారీలు 6 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు తీశారు. ప్రస్తుతం 6 వికెట్లు కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తొలిసారి సెమీస్ ఆడుతున్న అఫ్ఘాన్ జట్టు 50 పరుగులు కూడా చేయడం కష్టంగా కనిపిస్తున్నది.
అఫ్ఘాన్ బ్యాట్స్మెన్లలో అజ్మతుల్లా మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయకపోవడం గమనార్హం. ఓపెనర్ రహమానుల్లా, మహ్మద్ నబీ, ఖరోటే డకౌట్ అయ్యారు. ఇక సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీయగా, రబాడా ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు.