Kelvin Kiptum : మారథాన్‌లో రికార్డులు బద్ధలు కొట్టిన పరుగుల వీరుడు కెల్విన్ కిప్టుమ్(Kelvin Kiptum) కన్నుమూశాడు. 24 ఏండ్ల వయసులోనే కారు యాక్సిడెంట్(Car Accident)లో దుర్మరణం చెందాడు. దాంతో, కెన్యా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆదివారం కెన్యాలోని పశ్చిమ ప్రాంతంలోని ఎల్డొరెట్ సిటీ సమీపంలో రాత్రి 11 గంటలకు కెల్విన్ నడుపుతున్న కారు ప్రమానికి గురైంది.
అతివేగంతో దూసుకెళ్లతున్న కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఆ తర్వాత సమీపంలోని చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో అతడి పాటు ఉన్న కోచ్ జెర్వైస్ హకిజిమన(Gervais Hakizimana) కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న కెల్విన్ అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడడాన్ని క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కెల్విన్ కిప్టుమ్

మారథాన్ రన్నర్లకు పెట్టింది పేరైన కెన్యాలో పుట్టిన కెల్విన్ చిన్నవయసులోనే కెరీర్ ప్రారంభించాడు. అతడు తొలిసారి 2022లో వలెన్సియా మారథాన్‌లో పాల్గొన్నాడు. అక్కడితో మొదలైన కెల్విన్ ప్రభంజనం 2023లోనూ కొనసాగింది. నిరుడు అక్టోబర్‌లో జరిగిన చికాగోలో మారథాన్(Chicago Marathan)లో కెల్విన్ 2ః00.35 టైమింగ్‌తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంకేముంది ఒక్కసారిగా అతడు హీరో అయ్యాడు. ప్యారిస్ ఒలిపింక్స్(Paris Olympics) 2024లో ఈ యంగ్‌స్టర్ కెన్యాకు బంగారు పతకం అందిస్తాడని అందరూ ఊహించారు. కానీ, కెల్వన్ అకాలమరణం అందర్నీ షాక్‌కు గురిచేసింది.