Mumbai Open : ముంబై ఓపెన్లో లాత్వియా యువ కెరటం డర్జా సెమెనిస్టజా(Darja Semenistaja) చాంపియన్గా అతరించింది. 21 ఏండ్ల డర్జా తన కెరీర్లోనే పెద్ద సింగిల్స్ టైటిల్ సాధించింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ఆమె ఆస్ట్రేలియా ప్లేయర్ స్టార్మ్ హంటర్(Storm Hunter)పై గెలుపొందింది. రెండు గంటల పాటు జరిగిన పోరులో 5-7, 7-6 (6), 6-2తో విజయం సాధించి.. ఎల్ అండ్ టీ ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ చాంపియన్షిప్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
తద్వారా కొత్త ఏడాది భారత గడ్డపై సెమెనిస్టజా మూడో టైటిల్ ఖాతాలో వేసుకుంది. గత వారం ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన ఈ లాత్వియా యువకెరట జనవరిలో డర్జా బెంగళూరులో ఐటీఎఫ్ డబ్ల్యూ 50 టైటిల్ గెలిచింది.
ట్రోఫీతో డర్జా సెమెనిస్టజా
ఆదివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో టాస్ సీడ్ ప్రార్థనా థొంబరే, అరియన్నె హర్టొనేకు షాక్ తగిలింది. రెండో సీడ్ డలిలా జకుపోవిక్, సబ్రిన శాంటామారియా జోడీ సంచనల ఆటతో నంబర్ 1 ద్వయానికి చెక్ పెట్టింది. రెండు సెట్లో జోరు కొనసాగించిన డలిలా, సబ్రిన 6-4, 6-3తో గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది.