హైదారాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సెక్రటేరియట్ అగ్నిమాపకశాఖ ఏడీఎఫ్‌ఓ జీవీ ప్రసాద్ ఇటీవల ముంబైలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ప్రోకామ్ స్లామ్ 2024-25 మారథాన్ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసి టైటిల్ గెలిచారు. ఈ ఈవెంట్లో పోటీపడాలంటే కనీసం మూడు మారథాన్లలో ప్రతిభ చూపాలి. ఈ క్రమంలో జరిగిన టీసీఏ బెంగళూరు (10కి.మీ), వేదాంత ఢిల్లీ మారథాన్ (21కి.మీ), టాటా స్టీల్ కోల్‌కతా(25కి.మీ) ఈవెంట్లలో ప్రసాద్ సత్తాచాటారు. దీనికి కొనసాగింపుగా ఈనెల 19న ముంబైలో జరిగిన టాటా మారథాన్‌ను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా జీవీ ప్రసాద్‌ను డీజీ నాగిరెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.