ISSF : ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్ (Manu Bhaker) కీలక పోటీకి దూరమైంది. షూటింగ్ వరల్డ్ కప్ (Shooting World Cup)లో ఆమె పాల్గొనడం లేదు. దాంతో, స్వదేశంలో జరుగబోయే ఈ టోర్నీ కోసం భారత రైఫిల్ సమాఖ్య (ISSF) స్క్వాడ్‌ను ప్రకటించింది. ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్, ట్రాప్, స్కీట్ విభాగాల్లో పలువరు భారత షూటర్లు పోటీలో ఉన్నట్టు ఐఎస్ఎస్ఎఫ్ వెల్లడించింది.
పారిస్‌లో పతకం చేజార్చుకున్న అర్జున్ బబుతా, వరుణ్ తోమర్ సహ పలువురు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే.. భారత షూటర్లలో రిథమ్ సాంగ్వాన్ ఒక్కడే రెండు విభాగాల్లో బరిలో నిలిచాడు. అక్టోబర్ 13వ తేదీ నుంచి 18వ వరకూ పోటీలు జరుగనున్నాయి.
ఎయిర్ రైఫిల్ పురుషులు : దివ్యాన్ష్ సింగ్ పన్వర్, అర్జున్ బబుతా. ఎయిర్ రైఫిల్ మహిళలు : సోన్ ఉత్తమ్ మస్కర్, తిలోత్తమ సేన్. 50 మీటర్ల రైఫిల్ 3పీ పురుషులు : చియాన్ సింగ్, అఖిల్ షెరాన్. 50 మీటర్ల రైఫిల్ 3పీ మహిళలు : అశిష్ చౌస్కీ, నిశ్చల్. ఎయిర్ పిస్టల్ పురుషులు : అర్జున్ సింగ్ చీమ, వరుణ్ తోమర్. ఎయిర్ పిస్టల్ మహిళలు : రిథమ్ సాంగ్వాన్, సురభి రావు.
అర్జున్ బబుతా
25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషులు : అనిశ్, విజయ్‌వీర్ సిద్ధు. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ మహిళలు : రిథమ్ సాంగ్వాన్, సిమ్రన్ప్రీత్ కౌర్. ట్రాప్ పురుషులు : వివాన్ కపూర్, భువనేశ్ మెండిరట్ట. ట్రాప్ మహిళలు : రాజేశ్వరి కుమారి, శ్రేయాషి సింగ్. స్కీట్ పురుషులు : అనంత్‌జీత్ సింగ్ నరుక, మైరాజ్ అహ్మద్ ఖాన్. స్కీట్ మహిళలు : గనెమట్ సెఖొన్, మహేశ్వరి చౌహన్.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయిన భాకర్.. పారిస్‌లో పతక గర్జన చేసింది. కోచ్ జస్పాల్ రానా(Jaspal Rana) సలహాలతో ఆటలో మెరుగైన భాకర్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో మను భాకర్ కంచు మోత మోగించింది.
తద్వారా ఒకే విశ్వక్రీడల్లో రెండు పతకాలు కొల్లగొట్టిన భారత తొలి షూటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత పోటీల్లో మను మూడో స్థానంతో దేశానికి తొలి మెడల్ అందించింది. అనంతరం సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ ఈవెంట్లో మళ్లీ సత్తా చాటిన ఆమె కాంస్యంతో మెరిసింది.