Rakul Preet Singh – Prabhas | బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి బ్లాక్ బస్టర్లను అందుకుంది. ఇక చివరిగా కొండపొలం సినిమాలో కనిపించింది ఈ భామ. అయితే తన కెరీర్లో మొదట్లో ప్రభాస్‌తో నటించే అవకాశం వచ్చిందని ఆ తర్వాత తనకు తెలికుండానే ఆ అవకాశం కోల్పోయినట్లు చెప్పుకోచ్చింది.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న రకుల్ మాట్లాడుతూ.. ప్రభాస్ తో రెండు తెలుగు చిత్రాలలో ఒకప్పుడు తనను అనుకున్నారని, కానీ తన స్థానంలో వేరే హీరోయిన్లను తీసుకున్నట్లు నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. నా కెరీర్ మొదట్లో ఒక సినిమా కోసం నాలుగు రోజులు షూటింగ్ చేశాను. ఆ ప్రాజెక్ట్ షూటింగ్ అనంతరం నా షెడ్యూల్ ముగించుకుని ఢిల్లీ వెళ్ళాను. అయితే తరువాత ఆ ప్రాజెక్ట్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. తర్వాత తెలిసింది నా స్థానంలో వేరే హీరోయిన్ ను తీసుకున్నారని. అయితే ఆ సినిమాలో ప్రభాస్ హీరో తెలిసి చాలా బాధపడ్డాను. కొన్నిసార్లు, పరిశ్రమ గురించి మనకు పెద్దగా తెలియనప్పుడు ఎంతో బాధను కలిగిస్తుందని రకుల్ తెలిపింది. ఇలాంటి ఘటనే ప్రభాస్ చేసిన మరో ప్రాజెక్ట్‌లో కూడా జరిగింది. ప్రభాస్ హీరో అనడంతో సినిమాకు నేను సంతకం చేసాను. కానీ ఇప్పటివరకు మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు అంటూ రకుల్ తెలిపింది.