Retail Inflation | ఆగస్టు నెల రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 3.65 శాతానికి చేరుకుంది. 2023తో పోలిస్తే గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేండ్ల కనిష్ట స్థాయి 3.54 శాతం వద్ద స్థిర పడిందని గురువారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణంలో దాదాపు సగ భాగం ప్రాతినిధ్యం ఉండే ఆహార ద్రవ్యోల్బణం మాత్రం జూలై నెలతో పోలిస్తే 5.42 నుంచి 5.66 శాతానికి పెరగడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రణ స్థాయిలో ఉన్నా.. కన్జూమర్ డ్యూరబుల్స్ ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి కంటే ఎక్కువగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రూపాయి బలహీనత, వర్షాకాలంలో ఒడిదొడుకులతో మున్ముందు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
జూలైతో పోలిస్తే ఆగస్టు నెల రిటైల్ ద్రవ్యోల్బణం 6.83 నుంచి 10.71 శాతానికి పడిపోయింది. నైరుతి రుతుపవనాల్లో ఒడిదొడుకుల వల్ల పంటల దిగుబడిపై ప్రభావం పడుతుందని, భవిష్యత్ లో ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పప్పుల ధరలు 13 శాతం, తృణ ధాన్యాల ధరలు 7.31 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫండ్ల ధరలు 6.45 శాతం, పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2.98 శాతం వద్ద నిలిచాయి. మాంసం-చేపల ద్రవ్యోల్బణం 4.30, కోడిగుడ్ల ద్రవ్యోల్బణం 7.14 శాతం, ఫ్యుయల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం మైనస్ 3.66 నుంచి మైనస్ 5.31 శాతానికి దిగి వచ్చింది. క్లాథింగ్ అండ్ ఫుట్ వేర్ ద్రవ్యోల్బణం 2.72 శాతం, గృహాల ద్రవ్యోల్బణం 2.66 శాతం వద్ద నిలిచింది.