జకార్తా: ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ మాన్సి సింగ్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 21 ఏండ్ల మాన్సి 16-21, 8-21తో ప్రపంచ 81వ ర్యాంకర్, చైనా షట్లర్ షు వెన్ జింగ్ చేతిలో పరాజయం పాలైంది.
76వ ర్యాంకర్ మాన్సి ఫైనల్‌కు చేరే క్రమంలో హాంకాంగ్‌కు చెందిన లో సిన్ యాన్ హ్యాపీ, భారత్‌కే చెందిన రెండో సీడ్ రక్షిత రామ్రాజ్ వంటి షట్లర్లపై గెలిచింది.