ICC ODI Rankings : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దంచికొడుతున్న బ్యాటర్ల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings)లో అదరగొట్టారు. న్యూజిలాండ్‌పై విధ్వంసక శతకం బాదిన తంజిమ్ బ్రిస్త్ (Tanzim Brits) టాప్-5లోకి దూసుకొచ్చింది. ఇండోర్ స్టేడియంలో రికార్డు శతకంతో సఫారీ జట్టును గెలిపించిన బ్రిస్త్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 706 పాయింట్లు ఉన్నాయి. భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అగ్రస్థానంలో నిలిచింది.
ఐసీసీ మంగళవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన అగ్రస్థానంలో నిలిచింది. వన్డే వరల్డ్ కప్ ముందు రెండు శతకాలతో మెరిసిన టీమిండియా వైస్ కెప్టెన్ 791 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఇంగ్లండ్ సారథి నాట్ సీవర్ బ్రంట్ రెండో ర్యాంక్ సాధించగా.. ఆసీస్ స్టార్ బ్యాటర్ బేత్ మూనీ 713 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాకే చెందిన అష్ గార్డ్నర్ 697 రేటింగ్ పాయింట్లతో ఐదో ర్యాంక్ పట్టేసింది.
Career highs for Tazmin Brits and Ash Gardner in the batting rankings after their World Cup centuries 💪 pic.twitter.com/R9iyKpaeTw
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2025