INDW vs ENGW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సెమీస్ రేసులో ముందంజ వేయాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. ఉత్కంఠ పోరులో స్మృతి మంధాన(88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), దీప్తి శర్మ(650)లు అర్ధ శతకాలతో మెరిసినా జట్టును గట్టెక్కించలేకపోయారు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా నాలుగు విజయాలతో నాట్ సీవర్ బ్రంట్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది.
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్‌లో చెలరేగిపోవాల్సిన భారత జట్టు నిరాశపరుస్తోంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో చివరిదాకా పోరాడి ఓడిన టీమిండియా.. ఇంగ్లండ్‌పైనా గెలుపుదిశగా సాగింది. స్మృతి మంధాన(88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(౭౦)లు సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి దారులు వేయగా.. లోయర్ ఆర్డర్ వైఫల్యంతో మ్యాచ్ చేజారింది. డెత్ ఓవర్లలో గొప్పగా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ నాలుగో విజయంతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. చివరి సెమీస్ స్థానం కోసం న్యూజిలాండ్, భారత్, పాకిస్థాన్ మధ్య పోటీ నెలకొంది.
Undefeated so far 💪 pic.twitter.com/rs3TWK6pXe
— ESPNcricinfo (@ESPNcricinfo) October 19, 2025
భారీ ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే లైఫ్ లభించినా ఓపెనర్ ప్రతీకా రావల్(6) సద్వినియోగం చేసుకోలేకపోయింది. పేసర్ లారెన్ బెల్ ఓవర్లో బౌండరీ బాదిన తను.. చివరి బంతికి షాట్‌కు యత్నించగా వికెట్ కీపర్ అమీ జోన్స్ చక్కని క్యాంచ్ అందుకుంది. దాంతో.. 13 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్ (24) లారెన్ బెల్ వేసిన 7వ ఓవర్లో రెండు బౌండరీలు బాది ఊపు తెచ్చింది. అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ బౌలింగ్‌లోనూ బౌండరీ బాదింది. పవర్ ప్లే చివరి ఓవర్లో రెండో ఫోర్లతో జోరు చూపించిన తను.. చివరి బంతికి ఎల్బీగా ఔటయ్యింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), స్మృతి మంధాన(68 నాటౌట్)తో కలిసి సాధికారిక ఇన్నింగ్స్ ఆడింది.
England win by 4 runs. #TeamIndia fought hard in a closely contested match and will look to bounce back on Thursday.
Scorecard ▶ https://t.co/jaq4eHaH5w#WomenInBlue | #CWC25 | #INDvENG pic.twitter.com/f9xKaO1ydg
— BCCI Women (@BCCIWomen) October 19, 2025
ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఎకిల్‌స్టోన్, చార్లీ డీన్లను దీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం అర్ధ శతకాలతో జట్టు స్కోర్ 150 దాటించింది. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన కౌర్.. బ్రంట్ ఓవర్లో వెనుదిరగడంతో 167 వద్ద మూడో వికెట్ పడింది. క్రాంప్స్‌తో ఇబ్బంది పడిన మంధాన దీప్తి శర్మ(50)తో మరో విలువైన రన్స్ జోడించింది. కానీ, రన్‌రేటు పెరిగిపోతుండగా.. భారీ షాట్లు ఆడే క్రమంలో బ్రంట్ ఓవర్లో మంధాన, రీచా ఘోష్ వికెట్ ఇచ్చేశారు. దీప్తి కూడా పేలవ షాట్‌తో వికెట్ ఇచ్చేయగా.. 12 బంతుల్లో 23 పరుగులు అవసరమయ్యాయి. 49వ ఓవర్లో 9, చివరి ఓవర్లోనూ.. 9 రన్స్ మాత్రమే రావడంతో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు టమ్మీ బ్యూమంట్(22), అమీ జోన్స్ (56) శుభారంభమివ్వడంతో మిడిలార్డర్ బ్యాటర్లు దంచేశారు. హీథర్ నైట్ (109) సెంచరీతో చెలరేగగా ఇంగ్లండ్ అలవోకగా 300 కొడుతుందనిపించింది. కానీ, డెత్ ఓవర్లలో పుంజుకున్న దీప్తి శర్మ (4-51), శ్రీచరణి(2-68) .. వరుసగా వికెట్లు తీశారు. వీరిద్దరి విజృంభణతో టెయిలెండర్లు చకచకా పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
Heather Knight’s fastest ODI century to date 👏
Queen. pic.twitter.com/ETXQQxMIUl
— England Cricket (@englandcricket) October 19, 2025