INDW VS AUSW : వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు పవర్ ప్లేలోనే డగౌట్ చేరారు. రెండో ఓవర్లోనే షఫాలీ వర్మ(10) ఎల్బీగా ఔట్ కాగా.. సూపర్ ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(24) అనూహ్యంగా వెనుదిరిగింది. కిమ్ గార్త్ వేసిన 10వ ఓవర్ రెండో బంతికి తను వికెట్ కీపర్ అలీసా చేతికి చిక్కింది.
అంపైర్ ఆ బంతిని వైడ్ ఇవ్వగా రివ్యూ తీసుకుంది ఆసీస్ కెప్టెన్. అయితే.. అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్స్ కనిపించగా.. మంధాన నిరాశగా పెవిలియన్ చేరింది. దాంతో రెండో వికెట్ 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పవర్ ప్లేలో రెండు వికెట్లు పడిన జట్టును ఆదుకొని.. ఇన్నింగ్స్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు జెమీమా రోడ్రిగ్స్(30 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(3 నాటౌట్). 12 ఓవర్లకు స్కోర్.. 73-2.