థానె : మహారాష్ట్రలోని థానెకు చెందిన ఓ వ్యక్తి 21 కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తిచేసి ఇంటికి తిరిగొచ్చే క్రమంలో కుప్పకూలిపోయి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. థానెలోని వసంత్ విహార్‌లో ఉంటున్న బెనె దెవసికి మారథాన్లు అంటే మక్కువ ఎక్కువ.
స్థానికంగా జరిగే పరుగు పందేలలో నిత్యం పాలు పంచుకునేవాడు. ఆదివారం థానె మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మారథాన్‌లో పాల్గొన్నాడు. అయితే ఇంటికి తిరిగొచ్చే క్రమంలో అతడు ఉన్నట్టుండిగా కుప్పకూలి ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు.