Pakistan | కరాచీ: చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్‌లోని కరాచీ నేషనల్ స్టేడియంలోకి ఓ వ్యక్తి నకిలీ అక్రెడిటేషన్ కార్డులతో వచ్చి పోలీసులకు దొరికిపోయాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇటీవల ముగిసిన పాకిస్థాన్, కివీస్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముజామిల్ ఖురేశి అనే వ్యక్తి తాను ఓ మీడియా చానెల్లో కెమెరామెన్‌గా పనిచేస్తున్నానని భద్రతా సిబ్బందిని నమ్మించాడు. కానీ అనుమానం వచ్చిన పోలీసులు అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు.